నీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక డ్రైవ్‌

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఈ నెల 16 నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కె.హరి త తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. నీటి మట్టం తగ్గిపోయి సమస్యలు ఎదురయ్యే గ్రామాలను గుర్తించి, ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1916కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం పెంపకం కోసం సర్పంచులు, కార్యదర్శులకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూ చించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, మిషన్‌ భగీరథ ఈఈలు రాకేష్‌, సిద్దిక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులకు ప్రతినెలా ఎలక్ట్రోరల్‌ లిటరసీపై వ్యాసరచన పోటీలు నిర్వహించాల ని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం హైదరా బాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె.హరిత మాట్లాడారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ప్రతినెలా ఓటర్ల జాబితా, ఓటు వేయడం, ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. వ్యాస రచనలో 50 ప్రశ్నలు ఉండాలని, జిల్లావ్యాప్తంగా విద్యార్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్లు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.

పోర్టల్‌తో పారదర్శకంగా సేవలు

ఆసిఫాబాద్‌రూరల్‌: ఈ– హెఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా ఉద్యోగులకు పారదర్శకంగా ఆర్థిక సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్‌ హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, జిల్లా ఖాజానా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఈ– హెచ్‌ఆర్‌ఎంఎస్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సర్వీస్‌ వివరాలు, క్రమబద్ధీకరణ, ఇంక్రిమెంట్‌ అర్జిత సెలవుల వంటి సేవలను ఉద్యోగుల వ్యక్తిగత లాగిన్‌తో పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement