ఆసిఫాబాద్‌క్రైం: కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో 21 రోజులుగా కొనసాగుతున్న లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్యసేవలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడారు. మొత్తం 5,500 మందికి వైద్య సేవలు అందించగా.. 427 మందికి కంటి ఆపరేషన్లు, 55 మందికి చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, 12 మందికి ప్లాస్టిక్ సర్జరీలు, ఐదుగురికి ఎముకల సర్జరీలు, 500 మందికిపైగా పంటి చికిత్సలు అందించినట్లు తెలిపారు. 2,124 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ సేవలు మరువలేనివని కొనియాడారు. రోగులు, అటెండర్లు సుమారు ఆరు వేల మందికి ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21 రోజులపాటు భోజన సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఉచిత వైద్య శిబిరంలో సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నాగేంద్ర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ అవినాష్, డాక్టర్ సీతారాం, ఎస్పీఎం జీఎం శ్రీమన్నారాయణ, కౌన్సిలర్లు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


