ధరలకు కళ్లెం పడేనా! | - | Sakshi
Sakshi News home page

ధరలకు కళ్లెం పడేనా!

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

ఆకాశాన్నంటుతున్న బియ్యం రేట్లు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు రంగంలోకి దిగిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు

రెబ్బెన: వర్షాభావ పరిస్థితులు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయగా, దాని ప్రభావం సామా న్య, మధ్యతరగతి ప్రజలపై పడుతోంది. వానాకా లంలో ఇప్పటికే వరి సాగు విస్తీర్ణం తగ్గగా, యాసంగిలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బియ్యం ధరలకు రెక్కలు వ స్తున్నాయి. రెండు నెలల క్రితం ఉన్న ధరలకు ప్రస్తు తం విక్రయిస్తున్న ధరలకు పొంతన లేకుండా పో యింది. రోజురోజుకూ ధరలు ఆకాశన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బియ్యం కొని తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ధరల కట్టడికి చర్యలు ప్రారంభించింది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

వ్యాపారులకు అవగాహన

ప్రభుత్వమే రకాలను బట్టి బియ్యం ధరలను నిర్ణయించింది. బీపీటీ క్వింటాల్‌కు రూ.6,400, హెచ్‌ఎంటీ, సోనా రకం బియ్యానికి రూ.7,400, జై శ్రీరామ్‌ రూ.7,900గా ధర నిర్ణయించింది. రంగంలోకి దిగిన జిల్లా సివిల్‌ సప్లై అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తూ నిబంధనలను వివరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వివరిస్తూ పోస్టర్‌ సైతం అందజేశారు. ధరల పట్టికను షాపుల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.

నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రైస్‌మిల్లర్లు, రైస్‌ డిపోలు, దుకాణదారులకు తెలియజేస్తున్నాం. రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించాం. నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయించాలని ఆదేశించాం. ధరల పట్టికతో కూడిన పోస్టర్లను సైతం అందజేశాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– వాజిద్‌ అలీ, జిల్లా పౌర సరఫరాల అధికారి

రూ.10వేలకు చేరిన ‘జైశ్రీరామ్‌’

గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. రెండు నెలల క్రితం క్వింటాల్‌కు రూ.6,000 నుంచి రూ.6,500 లోపే ఉన్న జైశ్రీరామ్‌ బియ్యం ప్రస్తుతం రూ.10 వేలకు అమ్ముతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. జైశ్రీరామ్‌ బియ్యం బాటలోనే బీపీటీ, సోనా, హెచ్‌ఎంటీ బియ్యం ధరలు పరుగెడుతున్నాయి. బియ్యం ధరల పెరుగుదలకు ప్రభుత్వం కళ్లెం వేసే చర్యలు చేపట్టినప్పటికీ వ్యాపారుల వాదన అందుకు విరుద్ధంగా ఉంది. రైస్‌ మిల్లర్లు, హోల్‌సేల్‌గా అధిక ధరలకు విక్రయిస్తుంటే.. తాము మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎలా విక్రయించాలని ప్రశ్నిస్తున్నారు. మిల్లుల వద్ద నిర్ణీత ధరలకు బియ్యం లభించనప్పుడు చిల్లర వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయించడం ఎలా సాధ్యపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్‌గా ముందుకు సాగుతోంది. నిర్ణయించిన ధర కంటే అధిక రేటుకు విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే, అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో బియ్యం ధరలు అధికంగా పెరిగినందున విక్రయించడం లేదని చెప్పాలని మిల్లర్లు దుకాణదారులకు చెప్పడం గమనార్హం..

క్వింటాల్‌ బియ్యం ధరలు(రూ.లలో)

రకం రెండు ప్రస్తుతం ప్రస్తుతం

నెలల క్రితం (పాతవి) (కొత్తవి)

బీపీటీ 4,100 8,000 7,000

సోనా, హెచ్‌ఎంటీ 5,500 8,000 7,000

జైశ్రీరాం 6,200 10,000 8,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement