ప్రజలకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

చింతలమానెపల్లి: పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్‌ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, స్టేషన్‌ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికతో విని చట్టపరిధిలో పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. గుడుంబా, గంజాయి, బెట్టింగ్‌, పేకాట, అక్రమ రవాణాలపై నిరంతర నిఘా ఉండాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై కమలాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement