ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్పార్క్ బిగ్గెస్ట్ మోడలింగ్ ఈవెంట్ ఇన్ తెలంగాణ పోటీల్లో ఆసిఫాబాద్‌కు చెందిన దుర్గం స్వాతి ప్రతిభ చూపారు. మిస్టర్స్ కేటగిరీలో ఫైనలిస్టుగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి బుధవారం దుర్గం స్వాతిని ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ నుంచి రాష్ట్రస్థాయి అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరడం గర్వకారణమన్నారు. గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.


