ఆసిఫాబాద్‌క్రైమ్: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధాన మార్కె ట్, బజార్ ఏరియా తదితర ప్రాంతాల్లో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ, తూని కల కొలతల శాఖ, రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల అధికా రులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజి ద్ అలీ, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అజీజ్ పాషా, రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ఈ తనిఖీ ల్లో పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుండా కొలతల్లో వ్యత్యాసాలు, తూకం హెచ్చుతగ్గులకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేసే వారిని గుర్తించారు. ఈ సందర్భంగా నలుగురు రైస్ ట్రేడర్స్ దుకాణాలు, కిరాణా షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజిద్ అలీ మాట్లాడుతూ దుకాణాల్లోని బస్తాల్లో 26 కిలోల బియ్యం ఉండాలని, కొన్ని దుకాణాల్లో 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించి ధరలకే విక్రయాలు చేపట్టాలన్నారు. వస్తువులపై తయారీ, గడువు ముగింపు తేదీలు, తయారీ సంస్థ చిరునామా వంటి అంశాలను స్పష్టంగా ముద్రించాలని సూచించారు. అధిక ధరలకు వస్తువులు విక్రయించే వ్యాపారులు, తూకంలో మోసం చేసే వారిని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.


