ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం డీఈవో సచ్చిదానంద చారి చెకుముకి పోటీల పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ నైపుణ్యాలు పెంచేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


