‘పది’కి ప్రత్యేక తరగతులు | - | Sakshi
Sakshi News home page

‘పది’కి ప్రత్యేక తరగతులు

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం ● జనవరి 9 వరకు నిర్వహణ ● జిల్లాలో 7,518 మంది విద్యార్థులు ● జనవరి 10లోగా సిలబస్‌ పూర్తి చేసేలా టైంటేబుల్‌ రూపొందించుకోవాలి. ● నవంబర్‌ మొదటి వారం నుంచి నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో మొదటి 20 నిమిషాలు వివరణ, మిగిలిన 40 నిమిషాలపాటు సాధన చేయించాలి. ● విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధన సాగాలి. ● ప్రతీ పాఠానికి మూడు రోజుల ప్లాన్‌ ఉండాలి. ● విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని మార్గనిర్దేశం చేయాలి. ● ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పిల్ల ల అభ్యసన స్థాయిని తల్లిదండ్రులతో చర్చించాలి. ● విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. ● ప్రీ ఫైనల్‌ పరీక్షల ఫలితాలపై విశ్లేషణ చేయాలి.

ఆసిఫాబాద్‌రూరల్‌: ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షల్లో రాణించేలా జనవరి 9 వరకు ఈ ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి. సాయంత్రం రోజుకొక సబ్జెక్టు చొప్పున నిర్వహిస్తారు.

7,518 మంది ‘పది’ విద్యార్థులు..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల కింద 173 ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో 7,518 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం 4:45 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మొదటి 20 నిమిషాలు ఆ రోజు బోధించిన అంశంపై ముఖ్యమైన విషయాలు వివరిస్తుండగా, మిగతా 40 నిమిషాలు విద్యార్థులతో సాధన చేయించాలి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో సబ్జెక్టు చొప్పున వరుసగా తరగతులు జరుగుతాయి. సిలబస్‌లోని కీలకమైన చాప్టర్లు, క్లిష్టమైన విషయాలను వివరంగా బోధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల అకడమిక్‌ ప్రతిభను మెరుగుపరిచి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం సాధించాలి. రోజువారీ ప్రత్యేక తరగతుల రికార్డు నిర్వహించాలి.

ప్రణాళిక ఆదేశాలు ఇవి..

పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతతో పాటు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ఎనిమిది అంశాలను అమలు చేయాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యేక దృష్టి సారించాలి

పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత, ఉత్తమ ఫలితాలు సాధించేలా ఈ నెల మొదటి వారం నుంచి జనవరి 9 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రతిఒక్కరూ ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి.

– సచ్చిదానందచారి, జిల్లా విద్యాధికారి

జిల్లాలో పదో తరగతి విద్యార్థుల వివరాలు

మేనేజ్‌మెంట్‌ పాఠశాలలు బాలురు బాలికలు మొత్తం

ప్రభుత్వ 7 169 166 335

కేజీబీవీ 15 0 625 625

సోషల్‌ వెల్ఫేర్‌ 5 142 225 367

ట్రైబల్‌ వెల్ఫేర్‌ 5 114 300 414

ఆశ్రమాలు 39 616 760 1,376

లోకల్‌బాడీ 53 1,511 1,020 2,531

ఎయిడెడ్‌ 1 30 14 44

ప్రైవేట్‌ 36 604 485 1,089

మోడల్‌ స్కూళ్లు 2 111 89 200

బీసీ వెల్ఫేర్‌ 5 118 213 331

మైనారిటీ వెల్ఫేర్‌ 4 88 58 146

టీడబ్ల్యూ ఈఎంఆర్‌ఎస్‌ 1 33 27 60

మొత్తం 173 3,536 3,982 7,518

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement