ఆసిఫాబాద్అర్బన్: జల్, జంగల్, జమీన్ కోసం ప్రాణత్యాగం చేసిన కుమురంభీం 86వ స్మారక జెండా పూజను బుధవారం జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం అర్జు ముఖ్య అతిథులుగా హాజరై భీంకు నివాళులర్పించారు. కుమురంభీం పోరాటం, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి దిశగా సాగాలని సూచించారు. అంతకు ముందు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కుమురంభీం కుటుంబ సభ్యులు సీతారం, వెంకటేశ్, లచ్చు, నాయకులు మడావి శ్రీనివాస్, సుధాకర్, మోతీరాం, మారుతి, రఘు, బాదిరావు, మన్కు, వెంకటేశ్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.


