నెన్నెల: మండలంలోని జంగాల్‌పేటలో గల ఇంటి ఆవరణలో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. జంగాల్‌పేటకు చెందిన కోట సత్తయ్య అనే రైతు తన ఇంటికి ఆనుకొని ఉన్న పెరడులో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో తనిఖీ చేయగా ఏడు అడుగుల రెండు గంజాయి మొక్కలు, మూడు అడుగుల గంజాయి మొక్క, రెండు అడుగుల గంజాయి మొక్కలు లభించాయి. వాటి విలువ సుమారు రూ.40 వేలుగా అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో సిబ్బంది విజయ్, ప్రసాద్, వంశీ, రామ్‌రాజ్, ఏఈవో తిరుపతి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, జీపీవో ప్రసన్న ఉన్నారు.


