తిర్యాణి: మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో మంగళవారం జోనల్స్థాయి వాలీబా ల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. గిరిజన ప్రాంతా ల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని జిల్లా గిరిజన క్రీడల అధికారి మడావి శేకు తెలిపారు. బుధవారం క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మం, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుర్సెంగ శ్రీనివాస్, పీడీలు గుండం లక్ష్మణ్, మీనారెడ్డి, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.


