తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకం | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకం

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● కలెక్టర్‌ కె.హరిత

రెబ్బెన: పిల్లల్లో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని కలెక్ట ర్‌ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని రెబ్బెన ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మంగళవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యాబోధన తీరుతోపాటు వి ద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరి శీలించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు చక్కగా చదవడం, ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటర్‌ తరగతులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారితో మాట్లాడారు. విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరు, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

భూసమస్యల పరిష్కారానికి చర్యలు

దహెగాం: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన భూ భారతి దరఖాస్తుల సమస్యల పరిష్కార సదస్సుకు కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దహెగాం మండలంలోని భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని, రైతులు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. ప్రజాసేతు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాప్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా హత్తిని గ్రామానికి చెందిన పెద్దల బాణక్క అనే మహిళా రైతుకు మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో కలెక్టర్‌ రూ.1500 నగదు అందించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి 41 దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మునావార్‌ షరీఫ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement