ఆసిఫాబాద్‌అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీవో లు, పంచాయతీ కార్యదర్శులు, గిర్దావర్లు, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరి ష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములు, నీటిపారుదల శాఖ భూములను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, కాగజ్‌నగర్ డీఎల్‌పీవో హరిప్రసాద్, పట్టణ ప్రణాళిక అధికారి య శ్వంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


