గుడుంబా మత్తులో పల్లెలు! | - | Sakshi
Sakshi News home page

గుడుంబా మత్తులో పల్లెలు!

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

మారుమూల ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారీ దుకాణాల్లో జోరుగా అమ్మకాలు బానిసలుగా మారుతున్న కూలీలు, యువకులు

ఈ ఫొటోలో కనిపిస్తున్నది పెంచికల్‌పేట్‌ మండలం దరోగపల్లి సర్పంచ్‌ కృష్ణవేణితోపాటు గ్రామ మహిళలు. అక్రమంగా వెలసిన నాటుసారా తయారీ స్థావరాలపై ఎకై ్సజ్‌, పోలీసుశాఖ అధికారులు దాడులు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 2వ తేదీన కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కూలీలు, యువకులు గుడుంబాకు బానిసలుగా మారి అనారోగ్యం బారిన పడుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా బలహీన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచికల్‌పేట్‌: జిల్లాలోని మారుమూల పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. తయారీదారులు ప్రత్యేకంగా నీటి వసతి ఉన్న ప్రాంతాలను ఎంచుకుని నాటుసారా తయారీ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కూలీ పనులు చేసే కుటుంబాలు బానిసలుగా మారడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తమ గ్రామంలో గుడుంబా నిషేధించాలని కోరుతూ పెంచికల్‌పేట్‌ మండలంలోని దరోగపల్లి సర్పంచ్‌ బొట్టుపల్లి కృష్ణవేణి స్థానిక మహిళలతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం గుడుంబా తయారీ, విక్రయాల తీవ్రతకు అద్దం పడుతోంది.

గుట్టుగా రవాణా..

గ్రామీణ మండల కేంద్రాల నుంచి నిత్యం బొలేరో వాహనాలు పట్టణ ప్రాంతాలకు వాణిజ్యపరంగా రాకపోకలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు పట్టణాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారీకి వినియోగించే న ల్లబెల్లం, చక్కెర, పటిక, యూరియా పెద్దఎత్తున తరలిస్తున్నారు. అక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో గడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారు. బెల్లం అమ్మకాలపైన నిఘా పెరగడంతో వ్యాపారులు చక్కెర దిగుమతిపై దృష్టిసారించారు.

దుకాణాలే అడ్డాలు..

హానికరమైన పదార్థాలతో తయారు చేస్తున్న గుడుంబాను ప్యాకెట్ల రూపంలో కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరో జూ వేలాది లీటర్ల విక్రయాలు సాగుతున్నా యి. బెల్టుషాపులు, కొన్ని కిరాణాలు ఇందుకు అడ్డాలుగా మారాయి. నాటుసారా విక్రయాలను వృత్తిగా మార్చుకున్న కొంతమంది ప్రజ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అమ్మోనియా, యూరియా వంటి రసాయనాలతో అనారోగ్యం బారిన పడి ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు అడపాదడపా దాడులను చేస్తూ కేసులను నమోదు చేస్తున్నా తయారీ, విక్రయాలు ఆగడం లేదు. అధికారులు స్పందించి గ్రామాల్లో నాటుసారా విక్రయాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కేసులు 472

నేరస్తులు 404

పట్టుకున్న నాటుసారా 1,612 లీటర్లు

బెల్లం 112 కిలోలు

పటిక 80 కిలోలు

సీజ్‌ చేసిన వాహనాలు 39

ధ్వంసం చేసిన బెల్లం పానకం 8000 లీటర్లు

బైండోవర్‌ చేసిన వ్యక్తులు 117

కేసులు నమోదు చేస్తున్నాం

గ్రామాల్లో గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో పక్కా సమాచారంతో దాడులు చేసి తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. గ్రామాల్లోని తయారీ స్థావరాల గురించి ప్రజలు సమాచారం అందించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. గుడుంబా నియంత్రణకు ఆబ్కారీ శాఖకు సహకరించాలి.

– లక్ష్మానాయక్‌, జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement