ఆదివాసీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల సంక్షేమానికి కృషి

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, సంక్షేమానికి అటవీశాఖ కృషి చేస్తుందని డీఎఫ్‌వో బాలామణి అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న రహదారుల నిర్మాణం, ఆర్‌వోఆర్‌ పట్టాల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తదితర సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామన్నారు. అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, ఆదివాసీలు సైతం అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో టీఏజీఎస్‌ జిల్లా నాయకులు మాలశ్రీ, అశోక్‌, దామోదర్‌, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement