ప్రైవేట్‌కే పత్తి! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌కే పత్తి!

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

జిల్లాలో మొదలైన తీత పనులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పత్తి రాక వెలవెలబోతున్న సీసీఐ కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 3.77 లక్షల ఎకరాల్లో సాగు

దహెగాం: జిల్లాలో పత్తితీత పనులు మొదలయ్యా యి. కూలీలకు డబ్బులు చెల్లించడం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం తెచ్చిన అప్పులు కట్టడం, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం కొందరు రైతులు తొలివిడతలో కొన్ని క్వింటాళ్ల వరకు పంటను అమ్ముకుంటున్నారు. అయితే కొనుగోళ్లుకు సీసీఐ కేంద్రాలు అందుబాటులో ఉన్నా అన్నదాతలు మాత్రం ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో పంటను విక్రయించేందుకు ఇప్పటికీ ఒక్క స్లాట్‌ కూడా బుకింగ్‌ కాకపోవడం గమనార్హం.

సీసీఐలో నిల్‌

జిల్లాలో 3.77 ఎకరాల్లో పత్తి సాగైంది. జిల్లావ్యాప్తంగా జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌లో మరో 10 జిన్నింగ్‌ మిల్లులో కొనుగోళ్లు చేపడుతున్నారు. దీనికి తోడు ప్రైవేట్‌ వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి పంటకు క్వింటాల్‌కు రూ.8,667 మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్‌లో ఏకంగా రూ.9వేల పైబడి పలుకుతోంది. వ్యాపారులు అధిక ధర చెల్లిస్తుండటం, మరోవైపు ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులకు వాహన కిరాయి ఖర్చులు మిగులుతున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఒక్క రైతు కూడా సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికి ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోలేదు. మరోవైపు కౌలు రైతులకు యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌కు వీలుండదు. ప్రైవేట్‌ ధర తక్కువగా ఉంటే యజమాని పట్టా పాసుపుస్తకం, ఫోన్‌ నంబర్‌తో స్లాట్‌ బుక్‌ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం బయట ఆశించిన ధర ఉండటంతో వారు కూడా ప్రైవేట్‌ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు.

ధర ఉన్నా.. దిగుబడేది..?

వర్షాభావ పరిస్థితులు ఉన్నా జిల్లాలో గణనీయంగా పత్తి పంటను రైతులు సాగు చేశారు. కానీ కీలక స మయాల్లో వర్షాలు లేకపోవడంతో దిగుబడిపై ప్ర భావం చూపింది. పూత, కాత సమయంలో నేలలో తేమ లేకుండా పోయింది. సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్లకు దిగుబడి ఉండగా, ప్రస్తుతం 5 నుంచి 7 క్వింటాళ్లు మించే అవకాశం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మబ్బులు అన్నదాతలను కలవర పెడుతున్నాయి. నాలు గు రోజుల క్రితం అర్నబ్‌ తుపాను ప్రభావంతో ప లు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. ఇప్పుడు ముర సు తుపాను ప్రభావంతో వర్షాలు పడితే పగిలిన పత్తి నల్లబడి నష్టపోతామని, ప్రైవేట్‌ వ్యాపారులు ధర తగ్గిస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రైవేటు కొనుగోళ్ల జిన్నింగ్‌ మిల్లులు 10

గతేడాది సీసీఐ కొనుగోళ్లు

13.58 లక్షల క్వింటాళ్లు

ఈ ఏడాది ప్రైవేటు కొనుగోళ్లు

2 వేల క్వింటాళ్లు

ఈ ఏడాది

సీసీఐ కొనుగోళ్లు నిల్‌

గతేడాది ప్రైవేటు కొనుగోళ్లు

88 వేల క్వింటాళ్లు

స్లాట్‌ బుక్‌ చేసుకోవడం లేదు

జిల్లాలో పత్తి కొనుగోళ్లకు 24 సీసీఐ కేంద్రాలను ఇదివరకే ప్రారంభించాం. అన్ని కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేశాం. ప్రైవేటులో అధిక ధర ఉండటంతో రైతులు సీసీఐలో పత్తి విక్రయించడానికి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం లేదు. ప్రైవేటులో ఇప్పటివరకు సుమారు 2 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. రైతులు సీసీఐ కేంద్రాలకు వస్తే పంట కొనుగోలు చేస్తాం.

– అశ్వక్‌ అహ్మద్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

జిల్లాలో పత్తి కొనుగోళ్ల వివరాలు

సీసీఐ కేంద్రాలు

24

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement