రెబ్బెన: సింగరేణిలో పనిచేసే ఉద్యోగ క్రీడాకారులు క్రీడల్లో ప్రతిభ చూపాలని బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) దేవరకొండ కిరణ్‌బాబు అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీభీమన్న స్టేడియంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 93వ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం నియర్ బై క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల క్రీడాకారులు సమష్టిగా ప్రతిభ చూపాలన్నారు. శ్రమతో బొగ్గు ఉత్పత్తిలో ప్రతిభ చూపుతున్న సింగరేణి ఉద్యోగులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి సత్తా చాటాలని సూచించారు. కోలిండియా పోటీల్లో పతకాలను సాధించేలా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివా స్, వర్క్‌షాప్ హెచ్‌వోడీ జ్ఞానేశ్వర్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, కోఆర్డినేటర్ కిరణ్‌బాబు, జనరల్ కెప్టెన్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.


