ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు జనజాతి గౌరవ దివస్ నిర్వహించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ రూపొందించిన ట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భారత స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్రలను ప్రజలకు తెలియజేయడంతోపాటు బిర్సా ముండా వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, విద్యార్థులు, యువతలో గిరిజన వారసత్వంపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించా రు. ఇందులో భాగంగా మంగళవారం గిరిజనుల చరిత్ర, వారసత్వం, స్వాతంత్ర పోరాటంలో వారి పాత్రపై పాఠశాలలు, కళాశాలలు, గిరిజన వసతి గృహా ల్లో అవగాహన కార్యక్రమాలు, 4న గిరిజన వారసత్వంపై చిత్రలేఖనం, నినాదాల పోటీలు, 5న వ్యాసరచన, కథారచన, కవితా పోటీలు, 6న గిరి జన సంప్రదాయ కళలు, చేతి వృత్తులు, సంగీతం, నృత్యాలపై శిక్షణ శిబిరాలు, 7న గిరిజన కళలు, సంప్రదాయ చేతి వృత్తులు, సంగీత వాయిద్యాలు, విజ్ఞాన సంపదపై డాక్యుమెంటేషన్, ప్రదర్శనలు, 9న గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు, భాషలు, సంస్కృతి, వారసత్వంపై క్విజ్ పోటీలు, 10న ఆరో గ్యం, పోషకాహారం, సంక్షేమ పథకాలపై గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు, 11న మొక్కలు నాట డం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, 12న గిరి జన రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన ప్రముఖులు, విద్యావేత్తలు, కళాకారులు, సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులకు సన్మానం, 13న గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, జానపద సంగీతం, నాటకాలు, వీధి నాటకాలు, 14న గిరిజన వారసత్వం, ఫొటో ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 15న జనజాతి గౌరవ దివస్ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా, ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు పుష్పాంజలి ఘటించడం, స్మారక కార్యక్రమాలు, గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి వేదికతో పాటు ఐటీడీఏ సంస్థలు, పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు, విద్యాసంస్థలు, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


