సూరు స్ఫూర్తితో ఐక్యంగా హక్కుల సాధన | - | Sakshi
Sakshi News home page

సూరు స్ఫూర్తితో ఐక్యంగా హక్కుల సాధన

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

వాంకిడి: కుంరం సూరు స్ఫూర్తితో హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుదామని పీవీటీజీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీంరావు, కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సిడాం అన్నిగా పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం కుంరం సూరు 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొలాం యువత చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. హక్కుల సాధనకు సూరును ఆదర్శం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్‌ గోండ్‌ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి పెందుర్‌ సుధాకర్‌, నాయకులు గేడం తుకారాం, కుంరం పగ్గు, మాధురావు, దొడ్డిగూడ సర్పంచ్‌ మడావి నాగోరావు, ఉప సర్పంచ్‌ దీపక్‌ ముండె, భీంరావు, రాము, జల్పత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement