సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

● కలెక్టర్‌ కె.హరిత ● ప్రజావాణి అర్జీలు స్వీకరణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌ ఉంచొద్దన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన రవీంద్ర ప్రకాశ్‌ తన తండ్రి పేరిట ఉన్న పట్టా భూమిని ఇతరులు పట్టా మార్పు చేసుకున్నారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన రత్నం శాంత దరఖాస్తు అందించింది. పట్టా భూమి భూభారతి పోర్టల్‌లో ‘మిస్సింగ్‌’ ఉందని, వెంటనే సవరించాలని రెబ్బెన మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్‌ అర్జీ అందించాడు. మైనార్టీ గురుకులంలో డిప్యూటీ వార్డెన్‌ పోస్టు ఇప్పించాలని సిర్పూర్‌–టి మండల కేంద్రానికి చెందిన షఫీ బుబారఖ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో ఇతరులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారని కాగజ్‌నగర్‌ పట్టణం పోచమ్మ బస్తీకి చెందిన దుర్గం మొండి ఫిర్యాదు చేశాడు. కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లికి చెందిన ప్రజలు తమ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కేజీబీవీలో వాచ్‌ఉమెన్‌ పోస్టు ఇప్పించాలని సిర్పూర్‌–యు మండల కేంద్రానికి చెందిన చిట్యాల రాజామణి విన్నవించింది. దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని కాగజ్‌నగర్‌ మండలం చింతగుడ గ్రామానికి చెందిన యముల మల్లయ్య అర్జీ చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement