ఆసిఫాబాద్‌క్రైమ్: కాగజ్‌నగర్ పట్టణంలో సోమవా రం పౌరసరఫరా శాఖ అధికారులు బియ్యం దుకా ణాలు, పలు రైస్ మిల్లుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం గరిష్ట ధరలను నిర్ణయించిన నేపథ్యంలో అధిక ధరలకు విక్రయాలు జరిపే మిల్లర్లు, రైస్ ట్రేడర్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డీఎస్‌వో ఎండీ వాజిద్ అలీ ఆధ్వర్యంలో సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి ఎండీ సాదిక్ హుస్సే న్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ప్రధాన మార్కెట్‌తోపాటు పలు రైస్ మిల్లుల్లో స్టాక్ పరిశీలించారు. అనంతరం స్థానికంగా బియ్యం వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించి ధరలకే సన్న బియ్యం విక్రయించాలని ఆదేశించారు. కృత్రి మ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీపీటీ/కేఎన్‌ఎం రకం రూ.66, తెలంగా ణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్ రకం బియ్యం ధర రూ.79గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ రైస్ ట్రేడర్స్ రేటు బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు.


