ఆస్తి పన్ను వసూలు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను వసూలు వేగవంతం చేయాలి

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ము న్సిపాలిటీల్లో ఆస్తి పన్నులు, బకాయిల వసూలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం రెండు మున్సిపాలిటీల కమిషనర్లు అంజయ్య, తిరుపతి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్ల పురోగతిపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి, పట్టణ పరిధిలో వసతుల కల్పనకు ఆస్తి పన్ను సేకరణ కీలకమన్నారు. బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా పర్యటించి వందశాతం పన్ను వసూలు పూర్తి చేయాలని ఆదేశించా రు. దీర్ఘకాలికంగా బకాయిలు ఉన్న వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మొత్తం బకా యిదారులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. పట్టణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సీడీఎంఏ పోర్టల్‌, డిజిటల్‌ మాధ్యమాలతో సులభంగా పన్ను చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. నూతనంగా నిర్మించిన భవనాలు, విలీన ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం వెంటనే ఆస్తి పన్ను అసెస్మెంట్‌ పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement