ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, ఫిర్యాదులు చట్టప్రకారం పరి ష్కరించాలనే ఉద్దేశంతో పోలీసు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికా రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. ప్రజలు పోలీసు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.
30 పోలీసు యాక్టు కొనసాగింపు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో శాంతిభద్రతల రక్షణకు ఈ నెలాఖరు వరకు 30 పోలీసు యా క్టు 1861 కొనసాగిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజన్ పోలీ సు అధికారి లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని, ప్రజలు పోలీ సుశాఖకు సహకరించాలని కోరారు.


