తాంసి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యికి పైగా రైతు ఆత్మహత్యలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ఆదివారం పరామర్శించారు. ముందుగా రైతు కాడె లస్మన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లస్మన్నతో పాటు ఇటీవల బలవన్మరణాలకు పాల్పడిన రైతులు ప్రతాప్‌రెడ్డి, ప సుల ఆశన్న, బద్దం రాజేశ్వర్ రెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఖోడద్లో బస్సు షెల్టర్‌ను ప్రారంభించారు. నాయకులు తుల శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు.


