గుస్సాడీ హోరు షురూ! | - | Sakshi
Sakshi News home page

గుస్సాడీ హోరు షురూ!

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

వివరాలు 8లోu

ప్రశాంతంగా ఎన్‌ఎంఎస్‌ఎస్‌ పరీక్ష

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలో ఆదివా రం నేషనల్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) అర్హత పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలు ర, బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 396 మంది విద్యార్థులకు 373 మంది హాజరు కాగా, 23 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

భీం ఆశయ సాధనకు కృషి

కౌటాల: పోరాటయోధుడు కుమురంభీం ఆశ య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మన్నెవార్‌ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బా బాపు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివారం కుమురం భీం 86వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కు మురం భీం జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదాంతో గిరిజనుల విముక్తి కోసం నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే దండారీ సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలోని 1000 గూడేల్లో ప్రత్యేక ఉత్సవాలు కొనసాగనున్నాయి.

పాఠశాలలకు పార్ట్‌– 2 పాఠ్యపుస్తకాలు ఆలస్యం!

ఆసిఫాబాద్‌రూరల్‌: రెండో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు అందించాల్సిన పార్ట్‌– 2 పాఠ్యపుస్తకాలు ఇంకా పలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు చేరలేదు. దసరా సెలవుల తర్వాత పాఠశాలల పునః ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని బుక్‌ డిపో నుంచి అన్ని మండలాల కు పంపిణీ చేసి.. అక్కడి నుంచి పాఠశాలల కు అందించాలి. సెలవులు ముగిసి వారం గడుస్తున్నా నేటికీ బెజ్జూర్‌, వాంకిడి, రెబ్బెన, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌(టి), దహెగాం మండలాలకు సరఫరా కాలేదు. జిల్లా కేంద్రంలో ని బుక్‌ గోదాంకు ఆలస్యంగా పుస్తకాలు రావ డం, అక్కడి నుంచి పంపిణీలో జాప్యం జరగడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది పుస్తకాల రవాణా చార్జీలు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో మండల విద్యాధికారులు పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లేందు కు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement