‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం’

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఆదేశాలతో 34 మందితో యువ మోర్చా జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మండోకర్‌ వికాస్‌, బాలక్రిష్ణ, అజయ్‌గౌడ్‌, సాయికిరణ్‌, తిరుపతి, సాయిచరణ్‌, ప్రధాన కార్యదర్శులుగా అరుణ్‌, బనర్కార్‌ సాయికిరణ్‌ ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ అధి కారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల, విద్యాసంస్థల్లో వసతుల కల్పన వంటి హామీలు నెరవేర్చాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement