అంగట్లో ‘గెజిటెడ్‌ సంతకం’! | - | Sakshi
Sakshi News home page

అంగట్లో ‘గెజిటెడ్‌ సంతకం’!

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

● ఒక్కో సంతకానికి రూ.100 నుంచి రూ.500 డిమాండ్‌ ● ప్రజా అవసరాలను సొమ్ము చేసుకుంటున్న కొంతమంది అధికారులు

రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన కుమార్తె లేట్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం అవసరమైన నాన్‌ అవైలబులిటీ సర్టిఫికెట్‌ దరఖాస్తు చేయాలనుకున్నాడు. దీనికి ఇద్దరు గెజి టెడ్‌ అధికారుల సంతకాలు అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో గెజిటె డ్‌ హోదా కలిగిన వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక్క సంతకం కోసం ఆస్పత్రి సిబ్బంది రూ.100 డిమాండ్‌ చేశారు. చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చి సంతకం చేయించుకున్నాడు.

వాంకిడి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత నెలలో కల్యాణలక్ష్మి దరఖాస్తుకు సంబంధించిన గెజిటెడ్‌ సంతకం కోసం జిల్లా కేంద్రంలోని అదే ఆస్పత్రికి వెళ్లాడు. రూ.500 తీసుకుని గెజిటెడ్‌ సంతకం చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సదరు వైద్యుడు ఆస్పత్రిలో అందుబాటులో లేకున్నా హాస్పిటల్‌ సిబ్బంది స్టాంప్‌ వేసి వైద్యుడి సంతకం ఫోర్జరీ చేశారు. దీంతో సదరు ఆస్పత్రికి ఏ సమయంలో వెళ్లినా పని అవుతుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు గెజిటెడ్‌ సంతకాల కోసం క్యూకడుతున్నారు. ఈ రెండు ఘటనలు మాత్రమే కాదు.. జిల్లాలోని మెజారిటీ ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది.

తిర్యాణి: సాధారణంగా పలు సర్టిఫికెట్ల జారీ, పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ సమయంలో సంబంధిత అభ్యర్థులు అందించే ధ్రువపత్రాల్లోని సమాచారం సరైనదని నిర్ధారణ చేసుకునేందుకు ప్రభుత్వం గెజిటెడ్‌ సంతకాలు కోరుతుంది. అభ్యర్థులు, విద్యార్థుల ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని కొంతమంది గెజిటెడ్‌ ఉద్యోగులు అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు. గతంలో గెజిటెడ్‌ సంతకాల విషయంలో దరఖాస్తుదారుల నుంచి కేవలం ఒక పెన్ను కొనుకుని రమ్మని చెప్పేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మార్చారు. సర్టిఫికెట్‌ స్థాయికి అనుగుణంగా ఒక్కో సంతకానికి రూ.100 మొదలుకుని రూ.500 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కొందరు గెజిటెడ్‌ అధికారులు రోజుకు 10 నుంచి 20 వరకు సంతకాలు పెడుతూ రోజుకు రూ.2000 వరకు అదనపు ఆదాయం అర్జిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లో కేవలం ఒక్కరిద్దరు మాత్రమే గెజిటెడ్‌ అధికారులు ఉన్నారు. అక్కడి ప్రజలు గెజిటెడ్‌ సంతకాల కోసం జైనూర్‌ మండల కేంద్రానికి రావడం తప్పడం లేదు. అక్కడ ఓ ప్రభుత్వ వైద్యుడు సంతకానికి రూ.100 పైనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆదివాసీ మండలాల ప్రజలు ప్రయాణ, సంతకాల ఖర్చుల భారం మోయాల్సి వస్తోంది.

అక్రమాలకు ఆస్కారం

కుల ధ్రువీకరణ, లేట్‌ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, స్కాలర్‌షిప్‌ లు, ఉద్యోగాల భర్తీ సమయంలో సమర్పించే జిరాక్స్‌లను ధ్రువీకరించేందుకు గెజిటెడ్‌ సంతకాలు అవసరమవుతాయి. గెజిటెడ్‌ హో దా కలిగిన ఉద్యోగులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సరిచూసి ధ్రువీకరించుకుని సంతకాలు చేస్తారు. కానీ కొంతమంది ఉద్యోగులు వివరాలు క్షేత్రస్థాయిలో సరిచూడకుండానే డ బ్బులకు కక్కుర్తిపడి సంతకాలు అమ్ముకుంటున్నారు. దీంతో అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. సర్టిఫికెట్లలో వివరాలు అనుకూలంగా తారుమారు చేసుకునే వీలుంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గెజిటెడ్‌ సంతకాలు చేస్తున్న అధికారులపై దృష్టి సా రించి, అనర్హులు ధ్రువపత్రాలు పొందకుండా కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement