మంచిర్యాలరూరల్(హాజీపూర్): బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎంశ్రీ పాఠశాలల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లోని గుడిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బా లుర పాఠశాల ఖోఖో, కబడ్డీ జట్లు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ జట్ల క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 4న హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయిలో పీఎంశ్రీ పాఠశాలల స్పోర్ట్స్ మీట్లో వీరు పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపల్ శిరీష తె లిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌తో పాటు స్కూ ల్ గేమ్స్ సెక్రటరీ యాకూబ్, పీడీ సురేశ్, పీఈటీ నగేశ్, అధ్యాపకులు వీరిని అభినందించారు.


