నెన్నెల: దళితులను కులం పేరిట దూషించిన గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహన్‌కు ఆదిలాబాద్ సెక్షన్ కోర్టు స్పెషల్ జడ్జి బి.శశికుమార్ ఆరునెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు నెన్నెల ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2021 జనవరి 31న జరిగిన భూ తగాదాలో అదే గ్రామానికి చెందిన పో తురాజుల సురేశ్‌తో పాటు మరికొంత మంది దళితులను రామ్మోహన్ కులం పేరిట దూ షించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అ ప్పటి ఎస్సై రమాకాంత్ నెన్నెల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి బెల్లంపల్లి ఏసీపీ ఎం.ఏ.రహ్మన్ దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణరెడ్డి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారని ఎస్సై వివరించారు.
మహిళపై
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
నెన్నెల: భీమారం గ్రామానికి చెందిన కొత్తపల్లి పోశక్కపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కొత్తూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ మౌనిక అనే గిరిజన మహిళ గ్రామ శివారులోని మక్క చేనులో కలుపు తీస్తుండగా జరిగిన గొడవలో ఆమెను పోశక్క కులం పేరిట దూషించిందని, నానా బూతులు తిట్టిందని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
పోటాపోటీగా జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో జోనల్ స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు పోటాపోటీగా జరిగాయి. పోటీలను డీఈవో సచ్చిదానందచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోనల్ స్థాయి అండర్–14, 17, 19 ఎస్‌జీఎఫ్ బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో 100, 200, 400, 800, 1,500, 3వేల మీటర్ల రన్నింగ్, లాగ్ జంప్, హై జంప్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోన్‌రావు తెలిపారు. వీరిలో ప్రతిభ కనబర్చిన 80మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఎస్వో శ్రీనివాస్, నోడల్ అధికారి మీనారెడ్డి, పీడీలు, పీఈటీలు లక్ష్మణ్, రవి తదితరులున్నారు.


