హడలెత్తిస్తున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న పోలీసులు

Oct 31 2026 12:01 AM | Updated on Oct 31 2026 12:01 AM

మంచిర్యాలక్రైం: వరుస తనిఖీలతో పోలీసులు హడలెత్తిస్తున్నారు. ఈ నెల 29న అర్ధరాత్రి స్థానిక ఏసీపీ ప్రకాశ్‌ ప్రత్యేక పోలీసులతో కలిసి జిల్లా కేంద్రంలోని స్మోకింగ్‌ జోన్లు, టీ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై ఏ పనీ లేకుండా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న టీ పాయింట్ల యజమానులను మందలించారు. స్మోకింగ్‌ చేసేందుకు వచ్చిన యువకుల వివరాలు, వారి సెల్‌ నంబర్లు సేకరించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మ రోసారి అర్ధరాత్రి రోడ్ల మీద కనిపిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సీఐ ప్రమోద్‌రావు, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రామకృష్ణ, మధుసూదన్‌ పాల్గొన్నారు.

గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష

ఉట్నూర్‌రూరల్‌: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారులు, సహాయ ప్రాజెక్ట్‌ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో వీసీ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు హాజరయ్యారు. సమావేశంలో డైట్‌ బిల్లులు, కాస్మొటిక్‌, అద్దె చార్జీల చెల్లింపులు, పాఠశాలలు–వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులకు నాణ్యమైన ఆహా రం సరఫరా, యూనిఫాంల పంపిణీ, ఉపకార వేతనాల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌, పీఎం–జన్‌మన్‌ పథకాల పనుల పురోగతి, జీసీసీ బిల్లుల రీకన్సిలియేషన్‌, ట్రైకార్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఐదుగురిపై

నగర బహిష్కరణ వేటు

మంచిర్యాలక్రైం: జిల్లాలో వరుస గొడవలు, దాడులను పోలీస్‌ యంత్రాంగం సీరియస్‌ గా తీసుకుంది. ఐదుగురు రౌడీ షీటర్లపై నగ ర బహిష్కరణ వేటుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో ఇదివరకే నగర బహిష్కరణకు గురైన ఎర్రగుంటపల్లి సంపత్‌కు మరోసారి నగర బహిష్కరణ నోటీస్‌ శుక్రవారం జారీ చేశారు. మరో నలుగురిలో ఆత్మకూరి సంజీ వ్‌, దీటి సాయితేజ, ఆఫ్రోజ్‌, విశాల్‌ ఉన్నా రు. వీరికి నోటీసులు అందజేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమచారం. కాగా, సంజీవ్‌, సాయితేజ, ఆఫ్రోజ్‌లు పరారీలో ఉన్నా రు. విశాల్‌కు నోటీసులు అందినట్లు సమాచారం. ఇటీవల వరుసగా అర్ధరాత్రి రౌడీ షీ టర్ల ఇళ్లలో దాడులు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, పైగా ఇదివరకే అనుమానాస్పద వ్యక్తులను, ఇటీవల 44మంది యువకులను ఆర్టీవో ఎదుట బైండోవర్‌ చేసింది తెలిసిందే.

నగరంపై నిరంతర నిఘా

వరుస ఘటనల నేపథ్యంలో నగరంపై రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. 24/7 పెట్రోలింగ్‌, గస్తీ పెంచారు. జిల్లాలో లాడ్జీలు, శివారు ప్రాంతాల కాలనీలపై ప్రత్యేక నిఘా పెట్టా రు. సీపీ, డీసీపీ ప్రత్యక్షంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అ నుమానిత ప్రాంతాలు, రౌడీ షీటర్ల కదలికలపై కన్నేశారు. జిల్లా కేంద్రంలో బైపాస్‌ రోడ్‌, వైశ్యాభవన్‌, లక్ష్మి టాకీస్‌ వరకు, స్థానిక ఎమ్మెల్యే నివాస పరిసర ప్రాంతాలు, తిలక్‌నగర్‌, లాడ్జీలు, ప్రైవేట్‌ హాస్టళ్లలో జల్లెడ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement