జన్నారం: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందగా అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలకు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆపన్నహస్తం అందించింది. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓరుగంటి లింగయ్య మూడేళ్ల క్రితం, దివ్య నెల క్రి తం అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి అ మూల్య, స్పందన అనే కూతుళ్లున్నారు. తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సుదర్శన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ సంఘం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించారు. సంఘం ఆధ్వర్యంలో రూ.93,200 పోగు చేసి ఇద్దరు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినట్లు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమ య్య తెలిపారు. శుక్రవారం డిపాజిట్ బాండ్లను సర్పంచ్ నూతి రామయ్య చేతుల మీదుగా పిల్లలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల ఔదార్యాన్ని సర్పంచ్ అభినందించారు.


