పెంచికల్‌పేట్: జీవో 49పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. మండలంలోని కమ్మర్‌గాం గ్రామంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అడవుల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోతో అదివాసీల మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో ఎన్న డూ లేనివిధంగా అటవీ అధికారులు ఆదివా సీలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించా రు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కూడా రిజర్వు ఫారెస్టు పేరుతో అడ్డుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం చిన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు గంట సత్యం, అర్క శేషారావు, జిల్లా అధ్యక్షుడు తలండి మధుకర్, మురళీ గూడ సర్పంచ్ వెంకటేశ్, మడే మల్లేశ్ ఉన్నారు.


