కొలాంల దిక్సూచి.. ‘సూరు’ | - | Sakshi
Sakshi News home page

కొలాంల దిక్సూచి.. ‘సూరు’

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● నేడు జోడేఘాట్‌లో 29వ వర్ధంతి

జోడేఘాట్‌లోని సూరు విగ్రహం

కెరమెరి: నిజాం సై న్యంపై కుమురంభీం సాగించిన పోరులో కుమురం సూరు అండగా నిలిచారు. అలా గే స్వాతంత్య్రం తర్వా త కొలాం ప్రజలకు ది క్సూచిగా నిలిచి వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆసిఫాబాద్‌ మండలం శాకన్‌గొందిలో 1997 ఆగస్టు 10న ఆయన మృతి చెందారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం భీంతోపాటు సూరు వర్ధంతి నిర్వహించనున్నారు.

భీంకు అండదండలు

జోడేఘాట్‌కు చెందిన కుమురం చిన్ను, మారుబాయి దంపతులకు 1918లో సూరు జన్మించారు. గోండు, కొలాం ప్రజల వెనుకబాటుతనానికి నిజాం ప్రభుత్వం కారణమని భావించి ఎదురుతిరిగాడు. ఆ సమయంలోనే జోడేఘాట్‌కు కుమురంభీం రావడం ఆయనలో నూతనోత్తేజం నింపింది. ఆదివాసీలను ఏకం చేసి భీంకు అండగా నిలిచాడు. 12 పోరు గ్రామాలను ఏర్పాటు చేశారు. 1938– 40 సంవత్సరాల్లో ఆసిఫాబాద్‌ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో భీం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భీం జాడ కోసం సూరును మిలటరీ చిత్రహింసలు పెట్టింది. మడావి కొద్దు ఇచ్చిన సమాచారంతో భీంను సైనికులు కాల్చిచంపారు. అదే పోరాటంలో సూరు కుడిచేయి, కాలు పోగొట్టుకున్నాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు సమతుల గుండంలో ఆరు నెలలు అజ్ఞాతంలో గడిపాడు.

ఆదివాసీ కొలాం క్రాంతివీర్‌

1975లో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత అధి కారులతో చర్చించి కుమురం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు సూరు కృషి చేశారు. 1980లో కొలాం ప్రజల గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1986లో ఐటీడీఏలో కొలాం అభివృద్ధి అధికారిగా సూ రును నియమించింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభత్వం ‘ఆదివా సీ కొలాం క్రాంతీవీర్‌’ అనే బిరుదుతో గౌరవించింది. ఆసిఫాబాద్‌ మండలం శాకన్‌గొందిలో 1997 ఆగస్టు 10న ఆ యన తుదిశ్వాస విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement