ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ గుర్తింపు యూని యన్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ దిగజా రుడు రాజకీయాలు చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం మాట్లాడారు. ప్రభుత్వ అనుకూల టీడబ్ల్యూయూ కూటమికి మూడు రీజియన్లలో అక్రమంగా గుర్తింపు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. టీడబ్ల్యూయూ కూట మికి ఇచ్చిన అప్రజాస్వామిక గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని, నాలుగు రీజియన్లలో టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 28న లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కార్మికులతో మహాధర్నా చేపట్టనున్నట్లు హెచ్చరించారు. డిపో అధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి ఎల్పుల అశోక్, సహాయ కార్యదర్షి నరేశ్, కోశాధికారి బాబు, నాయకులు రాజేందర్‌సింగ్ పాల్గొన్నారు.


