జోడేఘాట్‌ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

జోడేఘాట్‌ ముస్తాబు

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● భీం వర్ధంతికి హాజరుకానున్న ఇద్దరు రాష్ట్ర మంత్రులు ● ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు ● ఉదయం 10 గంటలకు శ్రద్ధాంజలి ● మధ్యాహ్నం ప్రత్యేక దర్బార్‌ ● భారీ పోలీసుల బందోబస్తు

కెరమెరి: ఆదివాసీ ముద్దు బిడ్డ కుమురంభీం 86వ వర్ధంతికి కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ ముస్తాబైంది. భీం విగ్రహంతోపాటు మ్యూజి యం, జెండాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రజ ల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల కోసం హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. మధ్యాహ్నం గిరిజనులతో ప్రత్యేక దర్బార్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కా ర్యక్రమానికి రాష్ట్ర శిశుసంక్షేమశాఖ మంత్రి సీ తక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీలు హాజరు కానున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత కారణాలతో హాజరుకావడం లేదని తెలుస్తోంది.

అధికారులు, పోలీసుల కేటాయింపు

వర్ధంతి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల నుంచి అధికారులు, పోలీసులను కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ఐదుగరు, డీడీలు ఇద్దరు, పీజీ హెచ్‌ఎంలు నలుగులు, సీఆర్‌టీలు, రెగ్యులర్‌ టీచర్లు 50 మంది, నాలుగో తరగతి ఉద్యోగులు 200 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. అలాగే ఎంపీవోలు ఆరుగురు, పంచాయతీ కార్యదర్శులు 30 మంది, పారిశుద్ధ్య కార్మికులు 50 మంది, ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్‌ శాఖకు చెందిన 10 మంది విధులు నిర్వర్తించనున్నారు. మరోవైపు జోడేఘాట్‌ అటవీ ప్రాంతం కావడంతో పోలీసుశాఖ 600 మందితో పటిష్ట బందోబస్తు చేపట్టనుంది. ఇప్పటికే బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు ప్రారంభించారు. ఏఎస్పీతోపాటు డీఎస్పీలు ఇద్దరు, సీఐలు, ఆర్‌ఐలు 9 మంది, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు 40 మంది, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 94 మంది, ఇతర పోలీసులు 169 మంది, డబ్ల్యూపీసీలు, డబ్ల్యూహెచ్‌జీ 49 మంది హెచ్‌జీ 95 మంది, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, టీజీఎస్‌ 102 మంది, ఏరియా డామినేషన్‌ పార్టీకి చెందిన 40 మంది బందోబస్తు పర్యవేక్షించనున్నారు.

12 వేల మంది అంచనా

భీం వర్ధంతికి 12 వేల మందికి పైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్‌ డిపో నుంచి పది ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హట్టి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా వచ్చే ప్రైవేట్‌ వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. 20 వేల మంది వరకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖుల హాజరు

రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క బేగంపేట నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జోడేఘాట్‌ చేరుకోనున్నారు. అలాగే మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఉదయం 8 గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి నుంచి 11 గంటలకు జోడేఘాట్‌కు వస్తారు. వీరు దర్బార్‌తోపాటు ఇతర కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు.

జల్‌, జంగల్‌, జమీన్‌ అర్చీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement