కెరమెరి: జోడేఘాట్‌లో నిర్వహించే భీం వర్ధంతికి గిరిజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జాదవ్ అంబాజీ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉదయం నుంచే భోజనాలు ప్రారంభమవుతాయని, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కెరమెరి హట్టి కమాన్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.నాగార్జున, డీటీ సంతోష్‌కుమార్, భీం ఉత్సవ కమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.


