నేడు జోడేఘాట్‌లో అవ్వల్‌పేన్‌ పూజ | - | Sakshi
Sakshi News home page

నేడు జోడేఘాట్‌లో అవ్వల్‌పేన్‌ పూజ

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

కెరమెరి: కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఈ నెల 26న కుమురంభీం వర్ధంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం గిరిజన సంప్రదాయం ప్రకారం అవ్వాల్‌పేన్‌(పోచమ్మ) పూజలు నిర్వహించనున్నారు. పోరాట సమయంలో భీంకు పోచమ్మ తల్లి సహకరించిందనే నమ్మకంతో ఏటా ఆదివాసీలు వర్ధంతికి ఒకరోజు ముందు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. భీం వారసులతోపాటు ఆదివాసీలు అవ్వాల్‌పేన్‌ పూజకు హాజరు కానున్నారు. నిజాం ప్రభుత్వ సైనిక దళంపై కుమురంభీం ఏళ్లపాటు ఎదుర్కొని ఆదివాసీ పల్లెల్లో వారిని ముప్పు తిప్పలు పెట్టారు. పోచమ్మ ఆశీస్సులతో ఆయనకు ఒక్క బుల్లెట్‌ కూడా తగలలేదని ఆదివాసీలు నమ్ముతారు. అంతేకాకుండా అడవిలోని తేనెటీగలను భీం అస్త్రాలుగా ఉపయోగించి వదిలేవాడని చెబుతుంటారు. ఆముదం విత్తనాలను మంత్ర శక్తిద్వారా వినియోగించుకుని రక్షించుకునేవారు. ఈ నేపథ్యంలోనే భీం వంశస్తులు పోచమ్మ తల్లికి పూజలు చేస్తుంటారు. మంత్ర దండం శక్తిని ప్రసాదించినందుకు గొర్రెను బలిస్తారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement