ఆశ్రమ పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల తనిఖీ

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

రెబ్బెన: గోలేటి విలేజీలోని ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలను శనివారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు అడి గి తెలుసుకున్నారు. తరగతి గదులతోపాటు పరిసరాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చే శారు. పాఠశాల గదులు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. నాణ్య మైన విద్యనందించేందుకు టీచర్లు కృషి చే యాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల నిర్వహణ అధ్వానంగా మారిందని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బియ్యం పక్కదారి పట్టించారని, దీనిపై సమగ్ర విచారణ జరి పించాలని కోరారు. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ బియ్యం పక్కదారి పట్టిన ఆరోపణలపై వి చారణ జరిపి డీటీడీవోకు నివేదిక అందించా లని ఏటీడీవో పురుషోత్తంను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement