ఆసిఫాబాద్‌అర్బన్: రెండేళ్ల క్రితం చేపట్టిన సర్వే బకాయిలు చెల్లిస్తేనే తిరిగి లెప్రసీ సర్వే చేపడతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రారంభమయ్యే లెప్రసీ సర్వేకు గతంలో చెల్లించిన విధంగా ఆశ వర్కర్లకు పారితోషికం చెల్లించాలని, బకాయిలు విడుదల చేయాలని శనివారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో నాగేంద్రకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సర్వే సమయంలో ఆశవర్కర్లకు అదనపు పారితోషికం విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే సర్వేకు దూ రంగా ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి ప ద్మ, నాయకులు కవిత, అర్చన లక్ష్మి, సునీత, దయావతి తదితరులు పాల్గొన్నారు.


