ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక స్థోమత లేని నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికర సంస్థ చైర్పర్సన్ వి.శారదాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విచారణలో ఉన్న కేసులపై సమీక్షించారు. చట్టపరంగా బెయిల్ మంజూ రైన కేసుల్లో జాప్యం చేయొద్దన్నారు. సమావేశంలో డీఆర్వో వేణు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష, జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


