జోనల్‌ స్థాయికి 24 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జోనల్‌ స్థాయికి 24 మంది ఎంపిక

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాలిక ల ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌– 14, 17 బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరు కాగా, ప్రతిభ చూపిన 24 మందిని రెండు జట్లుగా జోనల్‌ స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ నెల 25న మంచిర్యాలలో జరిగే జోనల్‌స్థాయి పోటీల్లో ఈ రెండు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌, పీడీలు, పీఈటీలు తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement