రహదారిపై అభద్రత! | - | Sakshi
Sakshi News home page

రహదారిపై అభద్రత!

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్న యువత గ్రామీణ రహదారులపైనే అధికం మూలమలుపుల వద్ద కానరాని హెచ్చరిక బోర్డులు

చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాడి అజయ్‌ అనే యువకుడు మృతి చెందగా, ప్రేమ్‌కుమార్‌ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

బెజ్జూర్‌ మండలం సలుగుపల్లి మూలమలుపు వద్ద ఈ నెల 8న పల్సర్‌ బైక్‌ అదుపు తప్పడంతో నికూరి రాజయ్య, నికూరి అనంత్‌రావు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

గత జనవరిలో బెజ్జూర్‌ మండలంలోని కుంటలమానెపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో వంతెన పైనుంచి పడింది. తుమ్మలగూడకు చెందిన ఒక వ్యక్తి, కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు.

ఏప్రిల్‌లో చింతలమానెపల్లి మండలం అడెపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో కాగజ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

చింతలమానెపల్లి: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వాహనాల రద్దీ, అధ్వానంగా ఉన్న రహదా రులు, మూలమలుపు, పర్యవేక్షణ లోపాలు అమాయకుల ప్రాణాలను బలికొంటున్నాయి. వ్యవసా య సీజన్‌ ముగింపు దశకు రావడం, పండుగలు, శుభకార్యాల రద్దీతోపాటు.. దట్టమైన అడవులు, ప్రమాదకరమైన మూలమలుపులు, రాత్రింబవళ్లు దూసుకుపోయే భారీ టిప్పర్లతో రహదారులపై భ ద్రత కరువైంది. నెలల వ్యవధిలోనే సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలోని డబ్బా, సలుగుపల్లి, కుంటలమానెపల్లి, అడెపల్లి ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు క్షతగాత్రులుగా మార డం ఆందోళన కలిగిస్తోంది.

రహదారులపై పెరిగిన రద్దీ

రెబ్బెన నుంచి వాంకిడి మండలం సరిహద్దు వరకు జాతీయ రహదారి, ఆసిఫాబాద్‌– కెరమెరి మార్గం, సిర్పూర్‌ నియోజకవర్గంలోని అంతర్రాష్ట్ర రహదా రులతోపాటు గ్రామీణ రోడ్లపైనా రద్దీ పెరిగింది. మహారాష్ట్రలోని అహేరి, ఆళ్లపల్లి, ఏటపల్లి, ఛత్తీస్‌ గ ఢ్‌ రాష్ట్రానికి వెళ్లడానికి చింతలమానెపల్లి, గూడెం మీదుగా, సిర్పూర్‌ (టి) మండలంలోని మాకిడి మీ దుగా, వెంకట్రావుపేట మీదుగా మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారుల ఉన్నాయి. కౌటాల నుంచి చింతలమానెపల్లి మీదుగా బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌ ర హదారి, డబ్బా మీదుగా మరో రహదారి, కౌటాల నుంచి సిర్పూర్‌(టి) మీదుగా కాగజ్‌నగర్‌కు, గ్రామీ ణ మండలాలకు కాగజ్‌నగర్‌ నుంచి కూడా దారులు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలు పెరిగాయి. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి మీదుగా గూడెం, కౌటాల మండలం ముత్తంపేట కంకర క్వారీల నుంచి భారీ టిప్పర్లు నిత్యం తిరుగుతుంటాయి.

కారణాలు అనేకం.. బాధ్యత ప్రధానం

ఖర్జెల్లి నుంచి గూడెం మార్గం, డబ్బా నుంచి కడంబా మార్గం కాగజ్‌నగర్‌ వరకు అటవీ ప్రాంతం గుండా వెళ్తున్నాయి. ఈ మార్గాల్లో దట్టమైన అడవుల్లో రహదారి మలుపులు తిరిగి ఉంటుంది. ఖర్జెల్లి నుంచి గూడెం మార్గంలో ఏటా నిత్యం 40కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కౌటాల నుంచి చింతలమానెపల్లి, కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌ మీదుగా కౌటాల రహదారులపై సైతం ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రహదారిపై మలుపులు ఉండడం, వాహనదారులు మద్యం సేవించి ఉండడం, అతివేగమే కారణాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అలాగే యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగించే విషయం. సెకన్లలో అధిక వేగాన్ని అందుకునే వాహనాలను అదుపు చేసే సామర్థ్యం, వాహనాల వేగానికి తగిన రహదారులు లేనప్పుడు కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. గ్రామీణ రహదారుల్లోని మూలమలుపుల వద్ద వాహనాలు అదుపుకాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement