ఆసిఫాబాద్‌అర్బన్: పెత్తందారుల అన్యాయాలను ఎదురించిన ధైర్యశాలి, పేదల ఆకలి తీర్చిన ఆపద్బాంధవుడు పండుగ సాయన్న చరిత్ర నేటి త రానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రజావీరుడు సాయన్న జయంతి నిర్వహించారు. సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, అధికారులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్, సీపీవో గురువయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నదీమ్ తదితరులు పాల్గొన్నారు.
జనాభా గణనలో చార్ట్ అధికారుల పాత్ర కీలకం
ఆసిఫాబాద్‌అర్బన్: జనాభాగణన ప్రక్రియలో చార్ట్ అధి కారుల పాత్ర ఎంతో కీలకమని, వారికి ప్రతీ అంశంపై అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం తహసీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరితో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా గణన ప్రక్రియలో తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు చార్ట్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా గణన రెండు విడతలుగా ఉంటుందని, మొదటి విడతలో నివాస గృహాల గణన, రెండు విడతలో జనాభా గణన ఉంటుందని పేర్కొన్నారు. శిక్షకులు చెప్పే విషయాలను నోట్ చేసుకో వాలని సూచించారు. గణన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


