ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో కొన్ని నెలలుగా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్న వానరాల బెడదను తగ్గించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, చైర్మన్ మెంగ్రె ఆకాశ్తో పాటు పాలకవర్గ సభ్యులు పట్టణంలో సంచరిస్తున్న కోతులను పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. ఈ క్రమంలో గురువారం 120 కోతులను బంధించారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా కోతులను బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.


