ఆసిఫాబాద్‌అర్బన్: భూదాన్ భూముల వివరాలను భూభార తి పోర్టల్‌లో నమోదు చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ అ న్నారు. గురువారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో భూదాన్ భూ ముల వివరాల నమోదు, న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, భూసేకరణ వివరాలు, భూభారతి పోర్టల్‌లో నమోదు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రీసర్వే బృందాల ఏర్పాటుపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూదాన్ భూములు దాదాపు 1.60 లక్షల ఎకరాలు ఉన్నాయని, వాటి వివరాల ను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. న్యా యస్థానాల్లో దాదాపు 25వేల ఎకరాల భూ ములపై ఉన్న కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఆదేశించా రు. భూసేకరణ కింద సేకరించిన 90వేల ఎకరాలను భూభారతిలో నమోదు చేయాలని, ఇంకా సంబంధిత పట్టాదారుల పేరిట ఉన్నా యని పేర్కొన్నారు. భూముల రీసర్వే కోసం ప్రతీ మండలం నుంచి రెండు బృందాలను ఏర్పాటు చేసి, అవసరమైన రోవర్లను కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడారు. భూదాన్ భూముల వివరాల నమోదుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


