ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22 నుంచి 27 వరకు చైన్నెలో నిర్వహించే జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌కు తెలంగాణ జట్టుకు శిక్షకుడిగా నామినేట్ చేస్తూ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కోచింగ్‌లో లెవల్– 2 పూర్తి చేయడం, గతంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతోనే ఈ అవకాశం దక్కినట్లు విద్యాసాగర్ తెలిపారు. కాగా, ఇప్పటికే విద్యాసాగర్ ఐదుసార్లు తెలంగాణ రాష్ట్ర జట్టుకు శిక్షకుడిగా, ఒకసారి ఎన్‌ఐడీజేఏఎం క్యాంపునకు శిక్షకుడిగా వ్యవహరించారు.


