సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఈఈ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ అర్షద్‌కు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ మాట్లాడుతూ రాఘవ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు, జీవో నం.6 ప్రకారం వేతనాలు చెల్లించాలని, 8 గంటల పనివిధానం అమలు చేయాలని, పెండింగ్‌ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ఈపీఎఫ్‌ మొత్తాన్ని క్లియర్‌ చేసి, ఈపీఎఫ్‌ చెల్లించని ఏజెన్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు రూ.50లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జయకృష్ణ, తిరుపతి, బాపురావ్‌, వినోద్‌, రాజేశ్వర్‌, శ్రీకాంత్‌, నరేందర్‌, షభాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement