‘తిర్యాణి’లో వసతుల కల్పనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘తిర్యాణి’లో వసతుల కల్పనకు చర్యలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

● కలెక్టర్‌ కె.హరిత

తిర్యాణి: మండలంలో మౌలిక విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సీవైడీఏ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హోలిస్టిక్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తిర్యాణి మండల అభివృద్ధిలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, ప్రాథమిక వసతుల కల్పన, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అర్హులకు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం భూముల రీసర్వేలో భాగంగా దుగ్గపూర్‌ శివారులో చేపట్టిన సర్వే ప్రక్రియను పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. దుగ్గపూర్‌, గోయోగాం గ్రామాల మధ్య వర్షాకాలంలో దెబ్బతిన్న లోలెవల్‌ వంతెనను పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement