పత్తి పంటపై ఎల్‌నినో ప్రభావం ఉష్ణోగ్రతలు పెరగడంతో వడలిపోతున్న మొక్కలు దిగుబడి తగ్గుతుందని అన్నదాతల ఆవేదన
బెజ్జూర్: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. నెలరోజులుగా వర్షాలు లేకపోవడంతో పత్తి పంట ఎండ తీవ్రతను తట్టుకోలేక వాడిపోతోంది. కీలకమైన పూత, కాత దశలో పంటకు తగినంత తేమ అందకపోవడంతో ఆకులు, పూత, కాయలు రాలిపోతున్నా యి. ఈ ఏడాదైనా మెరుగైన దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయట పడాలనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దుక్కులు, కూలీల కోసం భారీగా ఖర్చు చేశారు.
3.70 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంటగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 3.70 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వేలాది రైతు కుటుంబాలకు తెల్లబంగారమే ప్రధాన జీవనాధారం. సాగు ప్రా రంభం నుంచి పంట చేతికొచ్చే వరకు అప్పులు చే సి మరీ పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంట దిగుబడిపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాలు లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో మొక్కలు వాడిపోతున్నాయి. పత్తిలో పూత, కా త దశలు అత్యంత కీలకం. ఈ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కానీ ప్రస్తుతం పగటి ఉ ష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నా యి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పరిస్థితులతో ఆ కులు, పూత, కాయలు రాలిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
దిగుబడిపై ప్రభావం
పత్తి సాగు కోసం రైతులు ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ దిగుబడి, మార్కెట్ ధరలపై భరోసా ఉండటం లేదు. జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో వర్షాభావంతో దిగుబడి తగ్గి తే పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థి తి ఉండదని ఆందోళన చెందుతున్నారు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి..? కుటుంబ పోషణ ఎలా సాగించాలి..? అని మనోవేదనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పత్తి పంటలను పరిశీలించి నష్ట తీవ్రతను అంచనా వేయాలని అన్నదాతలు కోరుతున్నా రు. మండలాల వారీగా పరిస్థితిని సమీక్షించి పంటలో తేమను కాపాడుకోవడం, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు అందించాలని విన్నవిస్తున్నారు.


