కలెక్టరేట్ ఎదుట సమ్మెకు దిగిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు మూడో రోజు వంటావార్పుతో నిరసన జిల్లావ్యాప్తంగా వైద్యసేవలకు అంతరాయం
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ ఉద్యోగికి కేడర్ ఫిక్సేషన్ అమలు చేసి వందశాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.
ఇతర సేవల ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ(ఎన్హెచ్ఎస్) పరిధిలోకి తెచ్చి స్పర్ష్ ద్వారా నేరుగా వేతనాలివ్వాలి.
సుదీర్గ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ మంజూరు చేయాలి. మహిళా సిబ్బందికి కేడర్తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, బీమాతో పా టు కుటుంబంలో ఒకరికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగావకాశం కల్పించాలి.
ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ భద్రతతోపాటు ఈహెచ్ఎస్ లేదా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
పెండింగ్ పీఆర్సీ బకాయిలను(ఏరియ ర్స్) తక్షణమే విడుదల చేయాలి.
ఆసిఫాబాద్అర్బన్: వైద్యశాఖలో పనిచేస్తున్న జాతీ య ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఈ నెల 13 నుంచి పోరుబాట పట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. మూడోరోజు గురువారం వంటావార్పు చేశారు. జిల్లాలో వైద్యులతోపాటు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 78 కేటగిరీలకు చెందిన 332 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లావ్యాప్తంగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 108 సబ్ సెంటర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 5, ఏరియా ఆసుపత్రి, టీ హబ్లో ఎన్హెచ్ఎం పరిధిలో మొత్తం 332 మంది చేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో వీరి సేవలు కీలకం. ప్రస్తుతం సమ్మెలో ఉండటంతో క్షేత్రస్థాయిలో సేవలపై ప్రభావం చూపుతోంది. ప్రజలకు వైద్యం అందడంలో అంతరాయం ఏర్పడుతోంది.
తప్పని పరిస్థితుల్లో సమ్మె
ఏళ్లుగా తక్కువ వేతనాలతో అంకితభావంతో పని చేస్తున్నాం. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
– బి.సాయికృష్ణగౌడ్, పీడీఎంవో, నజ్రూల్నగర్
ప్రధాన డిమాండ్లు


